Posts

Showing posts from October, 2022

దేవుడు

Image
తడబడ్డ అడుగును నాన్న దిద్దితే పొరబడ్డ నుదిటి గీతను గురువు దిద్దుతాడు  తిరగబడే కాలానికి ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని నింపుతాడు  బెత్తంతో కొట్టిన గట్టిగా వెన్నుతట్టి  మన బంగారు భవితకు మెరుగులు పెడతాడు దైవాన్ని అయినా గుర్తించే శక్తిని గురువైన ఆ దేవుడే ఇస్తాడు తిరిగే కాలానికి విలువ కట్టి నిలువెల్లా నింపుతాడు  తిరగబోయే కాలంలో జరగబోయే నిజాలు చెప్పి హెచ్చరిస్తాడు  కాలం నీకు నేర్పబోయే గుణపాఠాలను ముందుగానే పాఠాలుగా చెప్పి జాగ్రత్త చెప్తాడు  అడగకుండానే జన్మనిచ్చిన  తల్లిదండ్రులకు చివరి దశలో తోడుండి రుణం తీర్చుకుంటాం నీవు తప్ప ఎవరూ లేరని దండం పెట్టి దైవానికైనా పుష్పమో ఫలమో ఇచ్చి వరం కోరుతాం  ప్రతిఫలమే ఆశించకుండా మన నమస్కారానికే పొంగి వరమిచ్చే దేవుడే గురువు తల్లిదండ్రులకు సమానంగానో ఒక మెట్టు పైనో గురువు ఉన్నాడు 

ఇద్దరం ఒక్కటే తమ్ముడు

Image
ఇద్దరం ఒక్కటే తమ్ముడు ఇద్దరం ఒక్కటే తమ్ముడు అంటరాని వాడివంటు నిన్ను  రిజర్వేషన్ లేదంటు నన్ను  ఆఫీస్ నుండి బయటికి నన్ను ఊరు నుండి బయటికి నిన్ను గంజి పోయలేని స్థితిలో నేను గంజైన తాగనీయని స్థితిలో నిన్ను స్వాతంత్రం ముందు నువ్వు  స్వరాజ్యపు ఉక్కు కౌగిల్లో నేను  ఏది చేస్తే తప్పు అంటారో అని నువ్వు  ఏమీ చెయ్యలేని తప్పుల ఊబిలో నేను  భయంలో నువ్వు బాధలో నేను  ఇద్దరం ఒకటే తమ్ముడు  నా పైన అస్త్రానివి నువ్వు  నీ పైన అణుబాంబును నేను  రాజకీయ చదరంగంలో  పావులం తమ్ముడు మనం స్వేచ్ఛ కాంతులు సోకిన ఏడు దశాబ్దాల కాలంలో నేను ఎన్నో కోల్పోయాను  ఇకనైనా నన్ను నీలో కలుపుకో తమ్ముడు

రుధిరక్షర శాంతి సంతకం

Image
ఏ పేరైతే ఏమి ప్రాణాలు బలిగొనిన ప్రాంతమే చరిత్ర ఏదైనా రుధిరక్షర సంతకాల సమ్మేళనమే గతం ఎవరిదైనా సారాంశము ఒక్కటే అసువులు బాసిన వీరుల రక్త ప్రవాహమే  పసుపుతాళ్ళు తెగిన ఆడబిడ్డల అశ్రుధారలే మరి గొప్ప చెప్పగా ఏమున్నది ఏ ప్రాంతమైనా శాంతంటు జరిగిన పోరులో చిమ్మిన నెత్తుటి చుక్కల లెక్కలు తెలియవంటావా నియంతల నీడలో బానిసత్వపు సంకెళ్లు చేసే నిశ్శబ్ద శబ్దాలు ఎవరికి వినబడవంటావా పెద్ద గద్దెలనెక్కి పాలించి గొప్పలే చెప్పిన ఎన్ని పినుగులు తొక్కి పైకెక్కి నావో చూడరంటావా ప్రాంతాల పేర్లు చెప్పి పోరు చెయ్యకు హింసనే రగిల్చే ఆయుధానికి సమీదవై పుడమినే చిల్చు హద్దులే చెరిపి విశ్వమానవత చాటు మనిషివై క్రాంతివై విశ్వశాంతివై చీకటిలో  వెలుగు దివ్వేవై ఆర్తినే చల్లార్చు శాంతివై

నీ వాడిని నేను

Image
ఏది నాకోసం ఓ కన్నీటి చుక్కను రాల్చు మరుపురాని ముత్యమై మీ మెడను చేరుతాను మౌనమై నీ మదిన భాషించు మదీయరాగమై ప్రతిధ్వనిస్తాను కనులు మూసి స్వప్నించు తీయ్యని కలనై నీ కనులు చేరుతాను నను తలచి చిరునవ్వు చిందించు చిటికలో ఊహనై నీ ముందు ఉంటాను వేవేల తారలే నా కన్నులముందు తిరుగుతూ ఉన్న  సరితుగునా నా చెలి నవ్వుకి సరిపోల్చుతుంటాను కటిక చీకటంటి కష్టమే ఎదురైనా నీ గుండెలో దీపమై ధైర్యంగా ఉంటాను మనిషి అయితే ఉన్నాను మనసంతా నీ ధ్యాసే  దూరాన ఉన్న నీ వాడిని నేను నీ నీడై నీ తోడు ఉంటాను   

పండుగ

Image
పండగ పండగ మా ఊరు పండగ ఏడాది కోపాలి వచ్చెడి మా తల్లి పండుగ తప్పెట్ట్లు తాళాలు సాముగరిడిలు హరికథలు బుర్రకథలు వాలకాలాడెరు మందుగుండు సామాగ్రి మందుబాబుల తీరు మెండుగా పెలేను నింగిలో చుక్కలై మా సీమపడుచులే మెరిసేను చుట్టు పక్కల ఎటు చూడు చుట్టాల సందడ్లు  చిన్న పెద్దల కేరింతల కళకళలు  కణ కణ మండేటి సూరీడు ఒకకన్ను  మిలమిల మెరిసేటి చందురుడు ఒకకన్ను సకల సత్తువకు మూలమైన తల్లి శక్తినంతా నిలువెళ్ళ నింపి కొలువైన రోజు మా తల్లి మమ్ములిన్ని సల్లంగా చూడంటు సాగిల పడి మొక్కేటి జనుల తోడ నిండి కన్నుల పండగ పండగ మా ఊరి పండగ

సోయగం

Image
నువ్వో తొలి కిరణం  నీ చూపే ఓ బాణం నువ్వో వెచ్చదనం  నీ నవ్వో ఉషోదయం మది పలికెను నీ నామం  మతే చెడే ఓ అందమా సొగసుల సంకేతమా నా మాట మన్నించవా సరేనని వరించవా నేనో అగాథమై  ఇన్నాళ్లు ఉన్ననుగా  దయుంచి వర్షించవా  చినుకల్లే ముద్దుడవా నీ ప్రేమ వరనికై  నీ కొంగు నీడల్లే నీ చెప్పు జాడల్లే నీ చుట్టూ తిరిగానుగా  ఒక చూపే విసిరేసి  బొనసు ఇవ్వొచుగా  ఓ మాటు కసిరేసి  ఓ తిట్టు తిట్టేసి ఓ దెబ్బ కొట్టేసి నీ మొగుడలే ప్రమోషన్ ఏదో ఇవ్వొచ్చుగా నీ ప్రేమ కోరాను  నీ తోడు అడిగాను  మనువాడు కుందాము  ముచ్చట్లు చెప్తాను  నా ముద్దు తిర్చోచుగా

కవిత్వం

Image
కవిత్వం అంతరంగల మథనం తీరని కోర్కెల దాహం  ఎడారి ఒంటరి ప్రయాణం  చావేలేని మరో ప్రపంచానికి మార్గం  మహి విడిచి మహిమలు చూడగల మూడో నేత్రం రాలిపడే ఉల్కా పాతాళ సమూహం  ఎగసిపడే అలల సమాహారం  ఇతిహాస కల్పనల ఊహాగానం  పసిపిల్లల నవ్వులు కన్నెల అందాల కాల్పనికం మండే సూర్యుడు మరిగే రక్తపు చైతన్యం అణచివేతలు బానిసత్వపు తిరుగుబాటు విప్లవం మనసున్న మనుషుల తనలో తాను మాట్లాడుకునే స్వగతం