నిరీక్షణ
నీ రాకకై నేను నీ వాకిట బయట ఎదురు చూస్తుంటాను మరో జన్మకు సరిపోయేలా నిను నా కనుల నిండ నింపుకోవాలని వేచి ఉంటాను నీవు వచ్చేసరికి అలసిన నా కనులు నిద్రపోతుంటాయి నీవు నన్ను చూసి జాలైనా చూపక అలా తరలి వెళ్ళిపోతావు నేను మేల్కొనేసరికి నీవు అందనంత దూరాన్ని చేరుకుంటావు నిన్ను చేరాలనే ఆశ తప్ప శక్తి లేని అభాగ్యయుడినని సరిపుచ్చుకుంటాను నీవు ఎక్కడున్నావని అన్వేషించను నీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాను నీవు నడిచి వెళ్ళిన దారులలో పరచబడిన పువ్వులను చూస్తూ నువ్వు వెదజల్లిన పరిమళాలతో ముచ్చట్లు చెప్తూ నువ్వు వచ్చే రోజుకై ఎదురు చూస్తూ ఉంటాను...