పోరు బాట - బతుకు ఆశ/viplavam
✊పోరు బాట✊ బతుకు ఆశ బగ్గుమంటే రేపనేది చీకటైతే కాలే కడుపే అగ్గి చేరిగితే మింగ నీటి చుక్కలేక కంటి చుక్కలు నేల రాలితే పోరు రోషం రెచ్చగొడితే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే చేవలేని చెయ్యి కూడా ఉక్కుపిడికిలి బిగియబడితే విప్లవించిన ప్రతి స్వరము పోరు శంఖమై ప్రతిధ్వనిస్తే ఇది ప్రజాయుద్ధమై అరుణ కాంతులు ప్రకాశిస్తే గుండె మండి జ్వాల రేగి ఉద్యమానికి బాటలేస్తే వేగు చుక్కై వెలుగు వీరుల అడుగు చప్పుడు చముకుమంటే పెద్ద పులులై తరిమి తరిమి వేట కోరితే బల్లు మనవ సర్కారు గుండెలు చేత మీటిన తీగ వోలె వణికిపోవా ప్రతినిధుల గుండెలు -- మీ అప్పలరెడ్డి