Posts

Showing posts from May, 2021

జ్ఞానదీప్తి / telugu story

Image
జ్ఞానదీప్తి అంతా బాగుంటుంది నేను చెప్పినట్లు చెయ్యి పట్టింది బంగారం అవుతుంది ఇదిగో ఈ ఉంగరం పెట్టుకో. గురువుగారు ఇప్పటికే ఏడు ఉంగరాలు పెట్టుకున్నాను నా జీవితంలో ఏ మార్పు రాలేదు ఇప్పుడీ ఎనిమిదో ఉంగరం కుడానా. పెట్టుకో నాయన.   ఈ రోజు చాలా మంచి రోజు గుడికి వెళ్ళి  సహస్రనామార్చన చేయించుకో అంతా శుభమే శుభం నీ జాతకం ప్రకారం కూడా ప్రతి వారం గుడికి వెళ్ళాలి అంటూ మా గురువుగారు ఎప్పటి లాగానే చెప్పిందే చెప్పారు నేను ఎప్పటిలానే గుడికి వెళ్ళాను. నన్ను బాగా చూడు తండ్రి ప్రతివారం ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు ఎంతో కొంత దక్షిణ తెస్తూనే ఉన్న కదా కాస్త దయ చూపించు తండ్రి అంటూ ఎప్పటిలాగే దండం పెట్టేసి మూడు గుంజీలు నాలుగు మొట్టికాయలు వేసుకొని వచ్చేస్తుంటే . హాల్లో మాస్టారు  ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరా అని చూస్తే ఎవరు లేరు.  ఇక్కడ పిలుస్తుంటే దిక్కులు చూస్తావేంటయ్యా నేను నువ్వు పెట్టిన దీపాన్ని , యహే దీపం మాట్లాడం ఏంటి పక్కన ఎవరో ఉండి ఉంటారు. అని మళ్ళీ చుట్టూ చూస్తున్న ఎవరు కనిపించలేదు , ఒరేయ్ మగడా నేనే రా మాట్లాడేది , కాస్త ఆశ్చర్యం అనిపించిన ఏం చెప్తుందో విందాం అనుకున్న, ఇంకాస్...

సాయం సంధ్య / A true love story

Image
సాయం సంధ్య - కథ               ఏంటి ప్రకాశం గారు ఎప్పుడు పార్క్ లోకి వచ్చి అలా కూర్చొని వచ్చేపోయే జంటలను చూస్తూ  ఉంటారు ఎందుకని . సూర్యుడు నిదానంగా తగ్గుముఖం పడుతున్నాడు అడిగిన ప్రశ్న కొత్తదేం కాదు గాని ఈసారి మాత్రం కొత్తగా అనిపించింది నీకెందుకు అలా అనిపించింది రఘు . ఏం లేదు చాలా రోజుల నుంచి చూస్తున్నాను కదా ఏదైనా కారణం ఉందేమో అని . ఏం నేను చూడకూడదా . అలా అని కాదు మీరు ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు కదా ఎందుకా అని .    సూర్యుడు ఆకాశాన్ని ఎర్రని కాంతులతో నింపి లోకానికి చీకటిని పులుముతు నిద్రకు ముస్తాబవుతున్నాడు రఘు నేను ఇలా ఉండడానికి కారణం అయితే ఉంది కారణం ఒకటే అయిన అదే అనేక కారణాలుగా మారి నన్ను ఇలా చేసింది. చెప్పండి సార్ చెప్తే మేము తెలుసుకుంటాం కదా. మనిషి కోరికల రధానికి ఆశలు స్వార్థం అనే గుర్రాలను కట్టి పరుగులు తీస్తుంటారు అలాంటి పరుగులో ఓడిపోయాను . జీవిత పాఠాల ఉన్నాయి చెప్పండి సార్ మాకు అనుభవం వస్తుంది కదా మేము నేర్చుకుంటాం .  ఎంత తెలుసుకుంటూ నేర్చుకుంటున్న ఎంతోకొంత అనుభవంలోకి వస్తే కానీ తెలియదు. నిజమే అయిన తెలుసుకోవడం అనే...

క్షమించమ్మ /forgive me

Image
క్షమించమ్మ నీలోనే పుట్టాను నీలోనే పెరిగాను వేటనే జీవనాధారంగా చేసి ముందుకు నడిచాను ఆకలేసినప్పుడల్లా జీవాలను జిహ్వానికి బలి చేశాను ఎండ సెగలు వంటికి సోకగానే చెట్టు కొమ్మలని  ముక్కలై గుడిసెలై నిలిచేలా చేశాను  అడుగుపెట్టిన చోటల్లా నవీనత అంటూ నీ అందాని బద్దలు కొట్టాను  నీలో ఉన్న ధర్మాలను ఒక్కొక్కటి నేర్చుకున్నాను అని అనుకున్నాను నిప్పు పుట్టించాను నాగరికతను రగిలించాను చీకటనే అజ్ఞానాన్ని వదిలి కాంతి మార్గాన ప్రయాణం ఆరంభించానని అనుకున్నాను  కదిలే కాలానికి చక్రాలను కట్టి ముందుకు నడిపాను జోరు పెరిగింది చక్రాలు యంత్రాలై ముందుకు నడిచాయి వేగానికి తోడుగా పొగ గొట్టాలను  నీ ఊపిరితిత్తులకు బిగించాను ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు ప్రాణాలనే హరించాను రసాయనాలు తీసి నీ ఒంటి నిండా చల్లాను  నీ చర్మానికి తూట్లు పొడిచారు నీపై గడ్డి కూడా మొలవనీయక అణ్వస్త్రాలు ప్రయోగించాను అధికారం అగ్రస్థానం అనే వాటికోసం  నిరంతర యుద్ధాలు చేశాను నిన్ను వెచ్చని నెత్తుటితో  స్నానం ఆడించాను నాకంటే ముందు పుట్టి ఈ ప్రకృతిలో భాగమైన ఎన్నో జీవరాసులను ఒక్కొక్కటిగా నిర్మూలించాను తప్పని చెప్పక నా బిడ్డ భవ...

విలయం / vilayam

Image
విలయం ఈ విలయం ప్రళయాన్ని తలపిస్తుంది ఇదే అంతమేమో అనిపిస్తుంది నీ ప్రయాణం ప్రపంచాన్ని ఒకతాటిపైకి తేవడానికా  ఒకే దెబ్బకు తీసుకుపోవడానికా   బాధ్యత భయం లేని సమాజానికి   మృత్యుఘంటికలు మ్రోగించావు  సరిహద్దుల గీతలు తుడిచి  తలరాతలు మార్చి పంతాలను నేలమట్టం చేశావు తారతమ్య భేదాలకు నిప్పంటించి  అంతా ఒక్కటే అనిపించావు  ఇప్పుడు సామ్రాజ్యవాదంతో అగ్రరాజ్యం  అనిపించుకునే యుద్దాలు లేవు సాటి మనిషి బాధను చూసి అయ్యో అనలేని అందరి చేత కన్నీటి ధారలు పెట్టించావు అన్నార్తుల ఆర్తనాదాలు విని ఆదుకోవడానికి  చేయి అందించలేని చేతకానివాడిని చేసావు నువ్వు కాలు మోపిన చోట  ఎడారులను తలపించిన మహానగరాలు నిర్మానుష్యమైన రహదారులు నీ రాకను  తెలుపుతూ మరణం తధ్యం అన్నాయి అడవిని చుట్టూ ముట్టిన కారుచిచ్చుల కనివిని ఎరుగని రీతిలో కాటేస్తున్నావు మనసుని కట్టడి చేయలేని మనుషులు  సామాజిక బాధ్యతను వీడి నీ వైపే అడుగులు ప్రపంచానికి ఇన్ని ఇచ్చిన నువ్వు మాకు  ఎందుకు ఇవ్వవు జవాబుదారీతనం  ప్రాణ స్నేహితుడైనా శత్రువు అవుతున్న ఈ క్షణాన  మానవ నిర్లక్ష్యానిక...

ప్రేయసి / preyasi

Image
ప్రేయసి నా నీడ నీ బుగ్గ ముద్దాడుతుంటే అది చూసి మేనంత పులకించపోదా నీ కొంటే చూపే నా వీపునంత తడిమేస్తూ ఉంటే  మళ్ళించగలన నా మనసునైనా నీ ధ్యాసనుండి నేరుగా ఎదురైతే చూడగలనా నిన్ను  తారవై సాక్షాత్కరిస్తావు నా కన్నులముందు నీ అడుగుల సడి వినగానే మునుముందుకే తిరగదా కాలమే చక్రమై నేనెంత వాడిని తపించిపోనా నిన్ను చూడక ఒక్కరోజైనా  నిను వీడి నేనుండగలనా ఏ జన్మకైనా నీ జతను కోరి నీ చుట్టూ తిరిగే నన్ను  చూసి నీ నీడ అడిగే నీవెవరు అంటూ  జాలైనా లేదు కనులైన కలపవు ఉలకవు  పలకవు  నేనంటే నీకంత బెట్టెందుకు  మనసంతా నీ నామస్మరణే వరమిచ్చి కరుణించి తరలిరా తరించిపోతాయి నా తరాలు నీ రాకతో ...                                                                  -- అప్పలరెడ్డి

జాబిల్లి / jabilli

Image
జాబిల్లి ఏ తీగ పువ్వో సిరి గజ్జ మువ్వో వికసించిన పువ్వో ఆ చిరు నవ్వు మదిని మురుపించావో కనులతో కవ్వించావో  నీ ఊహలు నాపై రువ్వినవో నన్ను కదిలించి కరిగిపోయావు  నిన్ను కోరే నేను ఒంటరినో నీ జతకై నిన్ను వెతికే నీ తోడునో అందని జాబిలివై నింగిన దాగావో  మసకబారిన కంటి ముందు ముసుగువైనావు చీకటి అంచున చిరు దివ్వెవో నా ఆశల రథానికి సారథివో నువ్వు ఎప్పుడు ఉదయిస్తావో నీ రాకకై చూస్తున్న నేను....!                                                               --అప్పలరెడ్డి.

అమ్మ భాష / mother tounge

Image
అమ్మభాష - తెలుగు మాతృభాషను నేను  నీలో కలిగే భావాలకు  రూపాన్ని  నేను ఒక్క పదంతో మీ అందరిలో చైతన్యాన్ని  కలిగించగల విప్లవశక్తిని నేను అభ్యుదయ పదాలతో నిప్పుల  వర్షం కురిసే అలజడిని నేను ప్రేమగా లాలించే అమ్మ పాటను నేను నువ్వు అమ్మ నుండి బయటికి రాగానే  పరిచయమైన మొదటి మాటను నేను ఎన్ని భాషలు నేర్చిన బాధ కలగగానే  పలికే మొదటి పదాన్ని నేను  మనసారా బయటికి వ్యక్త పరచగల  మనో రథాన్ని నేను నేను లేని నీవు లేనే లేవు మరి ఎలా మరువగలవు నన్ను పండుగనాడు గుర్తు చేసుకొని  మొక్కి తప్పించుకుందాం అనుకుంటున్నావా నా వారసత్వాన్ని కూని చేసే హంతకుడివి కాబోకు    అమ్మ అని పిలవలేని మూగతనం నీకెందుకు                                                                     - అప్పలరెడ్డి

ఎర్ర గులాబీ / erra gulabi

Image
ఎర్ర గులాబీ నేనొక విప్లవశంఖాన్నీ ఒక్కసారైనా స్పృశించి చూడు నాలో రగిలే అగ్నిజ్వాలశిఖలు నాలోని భావం స్పురింపజేస్తాయి. ఒకసారైనా పూరించి చూడు నా గుండెలో దాగిన పేదల  కన్నీటి స్వరాలు వినిపిస్తాయి. నేనొక విప్లవ గీతాని నన్ను  స్మరించి చూడు నా వాణి నీ గళంలో ప్రతిధ్వనిస్తుంది. నేను అభ్యుదయ తీగలు  అమర్చబడిన వీణని ఒక్కసారి  మీటి చూడు ఎందరో అమరవీరుల స్వరాలు తంత్రులపై విహరిస్తాయి. భగ భగ మని కణ కణ మని సెగలు కక్కుతున్న చరిత్రను నేను ఒక్క అక్షరానైన పఠించి చూడు ఉప్పెనై ధనికుల ఆసాముల రాజుల రాజ్యాలను సైతం  ముంచేసిన దుఃఖ సంద్రం నీ కనులకు కనిపిస్తుంది. నేడు నువ్వు గుండె నిండా పీల్చుకున స్వేచ్ఛ వాయువుని నీకు తెలియకున్నా  నీ గత చరితను నీతోనే జీవిస్తున్నాను. నిర్భయంగా ప్రాణాలతో  ఉన్న ప్రేతాల మధ్య తిరుగుతున్న  నీ ధైర్యాన్ని నేను నీకు ఆరో ప్రాణాన్ని ఈ యుగాదిన వికసించిన ఎర్ర గులాబిని . అందరూ కోరుకునే ప్రపంచ శాంతికి మరో రూపాన్ని పెళ పెళ మని విరుచుకుపడు ఉరుముల మెరుపులను నాలో నింపుకొని నీలోని చైతన్యం ఆశిస్తూ నేను జ్వాలిస్తునే ఉంటాను.             ...