జ్ఞానదీప్తి / telugu story
అంతా బాగుంటుంది నేను చెప్పినట్లు చెయ్యి పట్టింది బంగారం అవుతుంది ఇదిగో ఈ ఉంగరం పెట్టుకో. గురువుగారు ఇప్పటికే ఏడు ఉంగరాలు పెట్టుకున్నాను నా జీవితంలో ఏ మార్పు రాలేదు ఇప్పుడీ ఎనిమిదో ఉంగరం కుడానా. పెట్టుకో నాయన.
ఈ రోజు చాలా మంచి రోజు గుడికి వెళ్ళి సహస్రనామార్చన చేయించుకో అంతా శుభమే శుభం నీ జాతకం ప్రకారం కూడా ప్రతి వారం గుడికి వెళ్ళాలి అంటూ మా గురువుగారు ఎప్పటి లాగానే చెప్పిందే చెప్పారు నేను ఎప్పటిలానే గుడికి వెళ్ళాను. నన్ను బాగా చూడు తండ్రి ప్రతివారం ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు ఎంతో కొంత దక్షిణ తెస్తూనే ఉన్న కదా కాస్త దయ చూపించు తండ్రి అంటూ ఎప్పటిలాగే దండం పెట్టేసి మూడు గుంజీలు నాలుగు మొట్టికాయలు వేసుకొని వచ్చేస్తుంటే . హాల్లో మాస్టారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరా అని చూస్తే ఎవరు లేరు.
ఇక్కడ పిలుస్తుంటే దిక్కులు చూస్తావేంటయ్యా నేను నువ్వు పెట్టిన దీపాన్ని , యహే దీపం మాట్లాడం ఏంటి పక్కన ఎవరో ఉండి ఉంటారు. అని మళ్ళీ చుట్టూ చూస్తున్న ఎవరు కనిపించలేదు , ఒరేయ్ మగడా నేనే రా మాట్లాడేది , కాస్త ఆశ్చర్యం అనిపించిన ఏం చెప్తుందో విందాం అనుకున్న, ఇంకాస్త ధైర్యం చేసి ఆ ఏంటి పిలిచావ్ అన్నాను.
దానికి అమాయకుడిలా కనిపించానో ఏమో , అలా కాదురా ఎందుకు భయపడతావ్ నేనేం చెయ్యనురా బాబు ఏంటి చేతినిండా ఉంగరాలు మెడనిండా తాయితులు గంగిరెద్దుల ఉన్నావ్ తెలుసా, అయితే ఏంటి ఇప్పుడు నా ఇష్టమొచ్చినట్టు వేసుకుంటా ఎందుకు పిలిచావ్, చిన్న డౌట్ వచ్చింది క్లియర్ చేస్తావేమో అడుగుదాం అని పిలిచాను.
అబ్బే తప్పుగా అనుకున్నాం మనలో ఉన్న తెలివిని గుర్తించింది. అందుకే మనల్నీ డౌట్స్ అడుగుతుంది. అయిన మన పెట్టిన బొడి దీపమేగా దానికేం నాలెడ్జి ఉంటుంది ఆ అడుకో చేపేస్తా అనేసాను , నువ్వు మార్చల్సింది చేతి ఉంగరాలు కాదు నీ బుర్రని నన్ను వెలిగించావ్ గాలికి వదిలేశావ్ నైవేద్యం ఈగలకి చీమలకి పెట్టావ్ మొక్కులు హుండీలో వేసి మా దేవుడిని కోరికలు తీర్చమంటావ్ ఏంటయ్యా , హాల్లో దీపంగారు అక్కడ బోర్డు చూసారా అక్కడ అదే రాసి ఉంది అదే చేశాం మాకు తెలుసు మేము చదువుకున్నాం.
అంత చదువుకుంటే ప్రతి మనిషిలోను దేవుడు ఉన్నాడు అవసరం ఉన్నవారికి సాయం చేస్తే చాలు అని తెలీదా, అవి అన్ని మాకు తెలుసు మరి మా కోరికలు ఎవరు వింటారు ఇక్కడైతే పది రూపాయలు దక్షిణ వేసి ఎన్ని కోరికలైన కోరుకోవచ్చు కాని బయట సాయం తీసుకుంటారు గానీ మా కోరికలు బాధలు ఎవరు వినరు , ఒరేయ్ వెధవ నువ్వు దీనికే ఇలా అయితే ఎలారా, స్పెషల్ , వి ఐ పీ , వీరభక్తులు , అమరభక్తులు, ప్రసాదంభక్తులు, నూనే దీపం భక్తులు, కర్పుర దీపం భక్తులు, గుడిమెట్లమోకాళ్ళభక్తులు , అలాంటి చాలా మందితో పాటు నీలాంటి సాధారణ భక్తులు ఉన్నారు.
వాళ్ళు యజ్ఞలు ,యాగాలు ,దానాలు ,ధర్మాలు, ఉత్సవాలు, ఊరేగింపులు, పాటలు, కోలాటాలు, ఏకాంతసేవలు ,గుండ్లు , ఉపన్యాసాలు, ఉపవాసాలు ఒకటేమిటి దేవుడికే తెలియని పూజలు చేసి పిచ్చెక్కిస్తున్నారు వాళ్ల ముందు నువ్వెంత నీ పూజలు ఎంత అయినా ఎవరు వినవలసిన అవసరం లేదు అన్ని ఆ భగవంతుడికి తెలుసు నీకు ఏం కావాలో అది నీకు ఇస్తాడు. నీకు ఉపయోగం లేనిది ఎన్ని సార్లు అడిగినా ఇవ్వడు.
నిలువు నామాలు పెట్టి అడ్డంగా దొర్లితే నీకు స్పెషల్ గా ఏమి ఇవ్వడు . ఉరుకో నీకు ఏం తెలీదు పూజలు వ్రతాలు చేసే మేమంతా పిచ్చొలమా మాకు తెలీదా మా గురువుగారు , టీవిలో వచ్చే స్వామీజీలు, మేము సినిమాలు అన్ని చూస్తున్నాం నువ్వు మాకేం చెప్పకర్లేదు . ఏడిసావలే వెధవ దేవుడు మీకు ఇచ్చిన ధనం, తిండి అంతా సమానంగా వాడుకొని బ్రతకమని ఇస్తే అభిషేకాలు నైవేద్యాలు అంటూ పాడుచేస్తారు ఎన్ని చెప్పినా మీకు అర్థంకాదు.
ఏదో చెబుదాం అమాయకుడిలా ఉన్నావ్ అనుకున్నగానీ నువ్వు వినేలా లేవ్ వెళ్లి పోర్లుదండలు పెట్టుకో . నీకేం తెలుసు మా గురువుగారు సాక్షాత్తు దేవుడు . అయితే నీ చావు నువ్వు చావు అంటూ దీపం ఆరిపోయింది , పిచ్చి దీపం దానికేం తెలుసు మళ్ళీ మామూలే దండలు మోటికాయలు ....
-- మీ అప్పలరెడ్డి
Comments
Post a Comment