సింధూరం


సింధూరం

అమ్మ ఇదిగో ఎర్రని రక్తం
నీ పాపిట కరిగిన సింధూరానికి బదులు తెచ్చాను 
నీ నుదుట బొట్టు చెరిపిన ముష్కరుల గుండెను చీల్చి నెత్తురు తీసి నీ పాదాలు కడుగుతున్నాను

ఇదిగో మతోన్మాద కసాయి మూకల పీకలు కోసి తలలు తెచ్చాను పుర్రెల మాల కడతాను 
అమాయకుల ఆర్తనాధాలతో మారుమ్రోగిన మంచుకొండలు ఇప్పుడు అరుణ కాంతులు ప్రసరిస్తున్నాయి

అదిగో శాంతి పతాకం రక్తంతో తడిసి తన గుణాన్ని కోల్పోయి యుద్ధ కాంక్షతో రగిలిపోతుంది
సంధి వాక్యలకు శాంతి మంత్రాలకు స్వస్తి పలికి చెల్లుచీటీ రాయబోతుంది
అర్థరాత్రి వెలుగులు చిమ్మి చీకటిని చిదిమేసి ఉగ్రవాదం పై ఉక్కు పాదం మోపింది 

కిలిమి అప్పలరెడ్డి 
తెలుగు అధ్యాపకులు
పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ జూనియర్ కళాశాల

Comments

Popular posts from this blog

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi