Posts

Showing posts from June, 2021

నేనే భారతీయుణ్ణి / i am indian

Image
నేనే - భారతీయుణ్ణి దైవాన్ని ధర్మాన్ని దైర్యాన్ని నేనే ఎదిరించిన శత్రువుల కంఠాలని  ఖండించే ఖడ్గాన్ని నేనే  మనసు లేని మనుషులలో చైతన్యాన్ని నేనే అనాధల అభాగ్యుల ఆక్రందన చల్లార్చే శాంతి నేనే స్వేచ్ఛా భారతంలో స్వేచ్ఛ లేని సంఘజీవిని నాలో విప్లవ శక్తులతో పోరాడే ఉద్యమ శక్తిని కనిపించని సంకెళ్ళతో బంధించిన బంధాల బందీని హద్దులు దాటి ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి ఎగిరి పోదామనుకునే సామాన్యుని నేనే అలుపు ఎరగని సూర్యుడికి సోదరుని  మట్టిని నమ్ముకున్న శ్రామికుని  కక్ష్యలు కార్పణ్యాలు తెలియని కర్షకుడిని బానిసత్వాన్ని వారసత్వంగా తీసుకున్న భారతీయుణ్ణి నేనే                                                               -- అప్పలరెడ్డి

నెలరాజు/ monthly king

Image
నెలరాజు చక్కనైన నెలరాజు తోడుగా వెన్నెలమ్మ చీకటి  వన్నెల విప్పి ప్రకృతమ్మ వాకిట కౌగిలి బిగువలో బంది అయి ఎర్రని సిగ్గుల బుగ్గన తారల మెరుపిస్తే మల్లెమొగ్గ విచ్చుకున్నది ఆ చల్లని నీలి రేయిలో విచ్చుకున్న మల్లెలన్ని మధువు చిలకగా చలిగాలులు చెలిగలులై గిలిగింతలు పెట్టగా యదను తాకినా మధుర జ్ఞాపకంలో తనువు జ్వలించేను మథనుని మనోనేత్రమై మదిన జనించు ప్రతి జ్వాల జయించినియదు ప్రణయరసాన్ని ఆ రస సాగరాన కలిసిన మధురమైన రసఝరీలో జగతి మిళితమైపోయి రసబంధాన్ని ఏనాడో పెనవేసుకుంది

నీ స్నేహం /urs friesndship

Image
నీ స్నేహం చలి గాలులు అనుకుంటున్న వేళ  అలసిన సూర్యుని నిద్రకు ముస్తాబవుతున్న వేళ చల్లని సాయంత్రపు అందాలను చూసి చూడనట్లు చూసే నీ నీలి కళ్ళలో దాగిన తారల వెలుగులు మరుగున పడిన ముచ్చట్లు జ్ఞాపకాలు తిరిగి  వచ్చిన ఆ క్షణాలు మరువ తరమా...! నిన్ను చూసిన ఆ క్షణం నా మది కాయను గాయం మాట రాని క్షణం తెలుపలేని భావం చూడగలిగే మనసుంటే అవధులు లేని ఆకాశపు లోతులను తాకే మధుర అనుభవాలు మరు జన్మకు దాచుకునే అంతులేని జ్ఞాపకాలు...! ఆ రోజు మొదలు ప్రతి రోజు నీరాకకై నిరంతర అన్వేషిణైతి నిన్ను చూసే ఈ క్షణం వరకు మాటలకు అందని ఎన్నో భావాలను నీ కళ్ళలో దాచావు నా మనసులో భావాలను సైతం అందుకోగలిగే నీవు నా స్నేహ హస్తాన్ని అందుకుంటావాని ఆశిస్తూ నేను...!