నేనే భారతీయుణ్ణి / i am indian
దైవాన్ని ధర్మాన్ని దైర్యాన్ని నేనే
ఎదిరించిన శత్రువుల కంఠాలని
ఖండించే ఖడ్గాన్ని నేనే
మనసు లేని మనుషులలో చైతన్యాన్ని నేనే
అనాధల అభాగ్యుల ఆక్రందన చల్లార్చే శాంతి నేనే
స్వేచ్ఛా భారతంలో స్వేచ్ఛ లేని సంఘజీవిని
నాలో విప్లవ శక్తులతో పోరాడే ఉద్యమ శక్తిని
కనిపించని సంకెళ్ళతో బంధించిన బంధాల బందీని
హద్దులు దాటి ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి ఎగిరి పోదామనుకునే సామాన్యుని నేనే
అలుపు ఎరగని సూర్యుడికి సోదరుని
మట్టిని నమ్ముకున్న శ్రామికుని
కక్ష్యలు కార్పణ్యాలు తెలియని కర్షకుడిని
బానిసత్వాన్ని వారసత్వంగా తీసుకున్న భారతీయుణ్ణి నేనే
-- అప్పలరెడ్డి
నిజమైన భారతీయతా భావానికి ఉత్తమమైన విమర్శే ఈ కవిత...
ReplyDeleteఅక్షరాలా భారతీయులు ఇంతేగా...మరి🤔