Posts

సింధూరం

Image
సింధూరం అమ్మ ఇదిగో ఎర్రని రక్తం నీ పాపిట కరిగిన సింధూరానికి బదులు తెచ్చాను  నీ నుదుట బొట్టు చెరిపిన ముష్కరుల గుండెను చీల్చి నెత్తురు తీసి నీ పాదాలు కడుగుతున్నాను ఇదిగో మతోన్మాద కసాయి మూకల పీకలు కోసి తలలు తెచ్చాను పుర్రెల మాల కడతాను  అమాయకుల ఆర్తనాధాలతో మారుమ్రోగిన మంచుకొండలు ఇప్పుడు అరుణ కాంతులు ప్రసరిస్తున్నాయి అదిగో శాంతి పతాకం రక్తంతో తడిసి తన గుణాన్ని కోల్పోయి యుద్ధ కాంక్షతో రగిలిపోతుంది సంధి వాక్యలకు శాంతి మంత్రాలకు స్వస్తి పలికి చెల్లుచీటీ రాయబోతుంది అర్థరాత్రి వెలుగులు చిమ్మి చీకటిని చిదిమేసి ఉగ్రవాదం పై ఉక్కు పాదం మోపింది  కిలిమి అప్పలరెడ్డి  తెలుగు అధ్యాపకులు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ జూనియర్ కళాశాల

మరో ప్రపంచం

Image
ఎక్కడ విజ్ఞానం స్వార్థపరుల చేతులలో నలిగిపోదో ఎక్కడ నిత్యం అభద్రత భావం తలెత్తదో  ఎక్కడ శ్రమ బానిసత్వంగా మార్పుచేందదో  ఎక్కడ అధికారం అహంకారగా మారదో ఎక్కడ మనిషి మనసు స్వేచ్ఛగా మనగలుగుతుందో  ఎక్కడ మనిషి మనిషిగా గౌరవించబడతాడో ఎక్కడ భావాలు నిర్భయంగా వ్యక్తపరచాగలుగుతామో  ఎక్కడ పరుల కన్నీరుతో పన్నీరు జల్లుకోరో  ఎక్కడ ప్రేమ కామంగా వ్యవహరించబడదో  ఎక్కడ నమ్మకం మోసానికి బలైపోదో  ఎక్కడ స్నేహం ముసుగుగా వాడుకోబడదో  ఎక్కడ స్వేచ్ఛ ఖైదు చేయబడదో  ఎక్కడ కుట్రలు కుతంత్రాలు రాజ్యమేలవో  ఎక్కడ ప్రశాంతత పరిఢవిల్లుతుందో  ఎక్కడ ప్రేమ అనంతవాహినిగా ప్రవహిస్తుందో  ఎక్కడ సంతోషం జడివానల తడిపేస్తుందో అక్కడికి ఆ మరో ప్రపంచానికి నన్ను తీసుకుపో మిత్రమా....

నీవైతే చాలు

Image
నీ పేరేదో ధ్వనించు శబ్దమే చాలు  నీ పైనుంచి వ్యాపించు గాలైన చాలు  నీ మృదుకరములు తాకించు స్పర్శైతే చాలు నుదుటినే ఉదయించి సూర్య బింబము చాలు కటిక చీకటికి మేటి నీ కంటి కాటుక చాలు రవివర్మ కుంచెకు జాలువారిన బొమ్మ చూస్తేనే చాలు రేయిలో హాయిగా తీయని కలవైతే చాలు  కడవరకు విడువక తోడుండు కోరికే లేదు  నేనెలా కోరేది ఆ గొప్ప వరము నీ జడపూజ పువ్వునైతే చాలు  నీ చిరునవ్వు చిందించు అధరాలు చిలికించు మధుర సుధలను చూడు చెక్కిళ్లపై చుక్కనైతే చాలు కనులకే కనిపించు కవ్వించు కవితలే రాయించు శక్తివే నువ్వు...

ఎన్నికలొచ్చాయి

Image
ఓ ఓటరు రాజకీయ వ్యూహాలు కమ్ముకున్నాయి త్వరపడు  విరుచుకుపడు రాజకీయ రాక్షసులకు  ఓటనే బ్రహ్మాస్త్రం సంధించు తిరుగులేని ఓటమినే చూపించు మాటల గారడీలకు బుద్ధిచెప్పు నోటుకు ముడివెయ్యకు ఓటును కులానికో మతానికో లొంగకు రేపటి భవితకు ఓటే ఓ రూటని మరువకు నాయకుడంటే రేపటి తరానికి తలరాతని తలపూంచు  మారని బతుకులు తీరని కష్టాలు గుర్తించు వివేకాన్ని చూపించు విచక్షణతో ఓటేయు...

నా ఓటు

నా ఓటు కలల సహకారానికి నవ సమాజ నిర్మాణానికి నా ఓటు సమానత్వానికి హక్కుల సాధికారానికి నా ఓటు అభివృద్ధికి అమ్ముడు పోనీ వ్యక్తిత్వానికి నా ఓటు పేదల కన్నీటిని తుడిచే చేతికి కష్ట కాలంలో వెన్నంటి నిలిచిన ధైర్యానికి నా ఓటు నా తరువాత తరాలకి తలవంచని ఆత్మగౌరవానికి  నా ఓటు నియంతలకు గొడ్డలి పెట్టు నా ఓటే నా స్వరం వినిపిస్తాను సమరశంఖమై రాజకీయ కురుక్షేత్ర సంగ్రామంలో...