ఎన్నికలొచ్చాయి
ఓ ఓటరు రాజకీయ వ్యూహాలు
కమ్ముకున్నాయి త్వరపడు
విరుచుకుపడు రాజకీయ రాక్షసులకు
ఓటనే బ్రహ్మాస్త్రం సంధించు
తిరుగులేని ఓటమినే చూపించు
మాటల గారడీలకు బుద్ధిచెప్పు
నోటుకు ముడివెయ్యకు ఓటును
కులానికో మతానికో లొంగకు
రేపటి భవితకు ఓటే ఓ రూటని మరువకు
నాయకుడంటే రేపటి తరానికి తలరాతని తలపూంచు
మారని బతుకులు తీరని కష్టాలు గుర్తించు
వివేకాన్ని చూపించు విచక్షణతో ఓటేయు...
Comments
Post a Comment