Posts

Showing posts from May, 2025

సింధూరం

Image
సింధూరం అమ్మ ఇదిగో ఎర్రని రక్తం నీ పాపిట కరిగిన సింధూరానికి బదులు తెచ్చాను  నీ నుదుట బొట్టు చెరిపిన ముష్కరుల గుండెను చీల్చి నెత్తురు తీసి నీ పాదాలు కడుగుతున్నాను ఇదిగో మతోన్మాద కసాయి మూకల పీకలు కోసి తలలు తెచ్చాను పుర్రెల మాల కడతాను  అమాయకుల ఆర్తనాధాలతో మారుమ్రోగిన మంచుకొండలు ఇప్పుడు అరుణ కాంతులు ప్రసరిస్తున్నాయి అదిగో శాంతి పతాకం రక్తంతో తడిసి తన గుణాన్ని కోల్పోయి యుద్ధ కాంక్షతో రగిలిపోతుంది సంధి వాక్యలకు శాంతి మంత్రాలకు స్వస్తి పలికి చెల్లుచీటీ రాయబోతుంది అర్థరాత్రి వెలుగులు చిమ్మి చీకటిని చిదిమేసి ఉగ్రవాదం పై ఉక్కు పాదం మోపింది  కిలిమి అప్పలరెడ్డి  తెలుగు అధ్యాపకులు పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ జూనియర్ కళాశాల