ఓ మగువా?/o maguva అప్పలరెడ్డి మంగళవారం, జులై 12, 2022ఓ మగువా?
కవితలే రాసినా కథలెన్ని చెప్పినా కనికరించదే నీ మనసు మౌనమే వీడవు మాటనే చెప్పావు ఎలా తెలుసుకోగలం నీ మనసు నీడలా తోడుగా అడుగులో జాడగా నిను విడిచి పోగలనా ఓ మనసా సూటిగా చూసినా సూదులే గుచ్చినా గాయమే కాదులే ఓ చెలియా నింగిలో తారలా తలుకుమనిపించినా ఎలా మరువను తొలినాటి చిరునవ్వు ఓ సఖియా దూరమే పెట్టినా కానకుండ దాగినా తనువే కదా దూరం ఓ మైనా రోజులే గడిచినా కాలమే తిరిగినా వేచివుండనా నేను నీ కోసం ఓ ప్రియతమా నువ్వు రాక ఉండినా మరణమే ముందుగా నను పలకరించినా ఈ కథలో జీవమై నేనుండి పోనా ఓ మగువా - కిలిమి అప్పలరెడ్డి.