ఓ మగువా?/o maguva అప్పలరెడ్డి మంగళవారం, జులై 12, 2022ఓ మగువా?



కవితలే రాసినా
కథలెన్ని చెప్పినా
కనికరించదే నీ మనసు

మౌనమే వీడవు 
మాటనే చెప్పావు
ఎలా తెలుసుకోగలం నీ మనసు

నీడలా తోడుగా
అడుగులో జాడగా
నిను విడిచి పోగలనా ఓ మనసా

సూటిగా చూసినా
సూదులే గుచ్చినా
గాయమే కాదులే ఓ చెలియా

నింగిలో తారలా
తలుకుమనిపించినా
ఎలా మరువను తొలినాటి చిరునవ్వు ఓ సఖియా

దూరమే పెట్టినా
కానకుండ దాగినా
తనువే కదా దూరం ఓ మైనా

రోజులే గడిచినా
కాలమే తిరిగినా
వేచివుండనా నేను నీ కోసం ఓ ప్రియతమా

నువ్వు రాక ఉండినా
మరణమే ముందుగా నను పలకరించినా
ఈ కథలో జీవమై నేనుండి పోనా ఓ మగువా
                                                                                                       - కిలిమి అప్పలరెడ్డి.





Comments

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi