మరో ప్రపంచం
ఎక్కడ విజ్ఞానం స్వార్థపరుల చేతులలో నలిగిపోదో ఎక్కడ నిత్యం అభద్రత భావం తలెత్తదో ఎక్కడ శ్రమ బానిసత్వంగా మార్పుచేందదో ఎక్కడ అధికారం అహంకారగా మారదో ఎక్కడ మనిషి మనసు స్వేచ్ఛగా మనగలుగుతుందో ఎక్కడ మనిషి మనిషిగా గౌరవించబడతాడో ఎక్కడ భావాలు నిర్భయంగా వ్యక్తపరచాగలుగుతామో ఎక్కడ పరుల కన్నీరుతో పన్నీరు జల్లుకోరో ఎక్కడ ప్రేమ కామంగా వ్యవహరించబడదో ఎక్కడ నమ్మకం మోసానికి బలైపోదో ఎక్కడ స్నేహం ముసుగుగా వాడుకోబడదో ఎక్కడ స్వేచ్ఛ ఖైదు చేయబడదో ఎక్కడ కుట్రలు కుతంత్రాలు రాజ్యమేలవో ఎక్కడ ప్రశాంతత పరిఢవిల్లుతుందో ఎక్కడ ప్రేమ అనంతవాహినిగా ప్రవహిస్తుందో ఎక్కడ సంతోషం జడివానల తడిపేస్తుందో అక్కడికి ఆ మరో ప్రపంచానికి నన్ను తీసుకుపో మిత్రమా....