ఇంద్రుని ఆరాటం వర్ణుడి ఆశాభంగం
చాలా కాలం క్రితం కొత్త ఇంద్రుడు ప్రమాణస్వీకారం జరిగి కొంతకాలం గడిచిన తరువాత ఒక పెద్ద సమస్య వచ్చింది . రెండు తెలుగు రాష్ట్రాలపై వర్ణుడు ఇంద్రునికి చెప్పకుండా ఇంద్రుడిని పదవి నుంచి తప్పించడానికి ఒక తుఫాను ప్లాన్ చేశాడు , వర్ణుని ప్లాన్ ప్రకారం వర్షంతో జనాలను దంచి కొడుతున్నాడు, ఇంక స్వర్గలోకంలో భూలోకం నుంచి ఫోన్లతో మోత మోగుతుంది... ఇంద్ర : ఎవర్రా వాళ్ళు ఏంటి ఫోను P.A Of ఇంద్ర : అయ్యా భూలోకం నుండయ్యా ఇం: ఏంటంటా P.A : ఇప్పుడు వర్షం ఆపుతారా లేదా అంటున్నారు అయ్యా ఇం : ఆపకపోతే ఏం చేస్తారంటా P.A : రాకేటేసుకొని పైకి రమ్మంటారెంటి అని అడుగుతున్నరండయ్యా ఇం : వాళ్ళ డిటైల్స్ కానుకో చూద్దాం అని చెప్పి ఫోన్ పెట్టై ఆ మాత్రం లోకజ్ఞానం లేకపోతే ఎలా బతుకుతావయ్యా P.A : తమ చిత్తం కుర్రోళ్ళు క్రికెట్ ఆడటానికి ఆడవాళ్ళు బట్టలు వడియాలు ఆరాబెట్టడానికి కొత్త జంటలకు బయట బయట తిరగటానికి అంటూ పెద్దలిస్టే పెట్టారు అయ్యా తమరు చూసి వర్ణుడికి కాల్ చెయ్యాలండయ్యా ఇం : ఇప్పుడు అప్పుడే అది అయ్యే పని కాదయ్యా దానికి చాలా పెద్ద ప్రోసెస్ ఉంది లే P.A : మీరు ఏ మాత్రం ఈ ఆర్డర్స్ లేట్ చేసిన వాళ...