ఇంద్రుని ఆరాటం వర్ణుడి ఆశాభంగం

చాలా కాలం క్రితం కొత్త ఇంద్రుడు ప్రమాణస్వీకారం జరిగి కొంతకాలం గడిచిన తరువాత ఒక పెద్ద సమస్య వచ్చింది . రెండు తెలుగు రాష్ట్రాలపై వర్ణుడు ఇంద్రునికి చెప్పకుండా ఇంద్రుడిని పదవి నుంచి తప్పించడానికి ఒక తుఫాను ప్లాన్ చేశాడు , వర్ణుని ప్లాన్ ప్రకారం వర్షంతో జనాలను దంచి కొడుతున్నాడు, ఇంక స్వర్గలోకంలో భూలోకం నుంచి ఫోన్లతో మోత మోగుతుంది...


ఇంద్ర : ఎవర్రా వాళ్ళు ఏంటి ఫోను

P.A Of ఇంద్ర : అయ్యా భూలోకం నుండయ్యా 

ఇం: ఏంటంటా

P.A : ఇప్పుడు వర్షం ఆపుతారా లేదా అంటున్నారు అయ్యా

ఇం : ఆపకపోతే ఏం చేస్తారంటా 

P.A : రాకేటేసుకొని పైకి రమ్మంటారెంటి అని అడుగుతున్నరండయ్యా

ఇం : వాళ్ళ డిటైల్స్ కానుకో చూద్దాం అని చెప్పి ఫోన్ పెట్టై ఆ మాత్రం లోకజ్ఞానం లేకపోతే ఎలా బతుకుతావయ్యా 

P.A : తమ చిత్తం కుర్రోళ్ళు క్రికెట్ ఆడటానికి  ఆడవాళ్ళు బట్టలు వడియాలు ఆరాబెట్టడానికి కొత్త జంటలకు బయట బయట తిరగటానికి అంటూ పెద్దలిస్టే పెట్టారు అయ్యా తమరు చూసి వర్ణుడికి కాల్ చెయ్యాలండయ్యా 

ఇం : ఇప్పుడు అప్పుడే అది అయ్యే పని కాదయ్యా దానికి చాలా పెద్ద ప్రోసెస్ ఉంది లే

P.A : మీరు ఏ మాత్రం ఈ ఆర్డర్స్ లేట్ చేసిన వాళ్ళు తాట తీస్తాం అంటూ ఒకడు, ప్రజలకు అన్యాయం జరిగిందంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఒకడు, రాజకీయాలు మొదలు పెటేస్తరండి ఇక మీ ఇష్టం

ఇం : ఏంటయ్యా వర్షానికే ఇంత చేస్తారా

P.A : వాళ్ళు ఎంత చేస్తారో మీకు తెలీదు లెండి వాళ్ళు నీటి బొట్టుకు నిమ్మ ముక్కకు రాజకీయం చేయగల సమర్థులండి 

ఇం : అంత చేస్తారంటావా

P.A : ఎంత చేస్తారనేది ప్రజల ఆసక్తి మీద టివి చానల్స్ టిఆర్పి రేటింగుల మీద ఆధారపడి ఉందండయ్యా 

ఇం : ఏమయ్యా పిఏ ఆ వర్ణుడికి ఫోను కలుపు ఎక్కడున్నాడో నా ప్రాణాల మీద తీసుకురావడానికి అంత డేంజరస్ ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడో 

P.A : తమరి చిత్తమండయ్యా

వర్ణుడు : నేను వర్ణుడిను మాట్లాడుతున్నాను అటువైపు ఎవరు

ఇం : ఎక్కడ చచ్చావయ్యా ప్రజలు ఇంత గోల చేస్తుంటే

వర్ణున : నేను అక్కడే ఉన్నాను ప్రభు 

ఇం : నువ్వు అక్కడ ఉన్నావనే నా బాధ కూడా త్వరగా అక్కడ నుంచి వచ్చేయ్

వర్ణున్ : ప్రభు నా షెడ్యూల్ ప్రకారమే వచ్చాను

ఇం : నీ షెడ్యూలు తీసి చంకలో పెట్టుకొని త్వరగా వచ్చేవయ్యా జనాలు స్వర్గం మీదకి యుద్ధం ప్రకటిస్తుంటే షెడ్యూల్ సొరకాయ అంటూ

వర్ణున : తమరి ఆజ్ఞ ప్రభు ( డామిడ్ కథ అడ్డం తిరిగింది )

ఇం : వీటికి ఏం తక్కువ లేవుగాని త్వరగా వచ్చి చావు వెళ్లేటప్పుడు చెప్ప పెట్టకండి వెళ్లి వచ్చేటప్పుడు మాత్రం అంత నామీదకి తోసెయ్

P.A : పెద్ద ప్రమాదం తప్పించుకున్నారండయ్యా 

ఇం : నువ్వు ఉండి బతికించావు గాని లేకపోతే నా పరిస్థితి ఏమైపోదును థాంక్యూ 

P.A : దానికేం ఉందండయ్యా మీకు కొత్త మాకు అలవాటే ....

Comments

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi