నా ఓటు
నా ఓటు కలల సహకారానికి
నవ సమాజ నిర్మాణానికి
నా ఓటు సమానత్వానికి
హక్కుల సాధికారానికి
నా ఓటు అభివృద్ధికి
అమ్ముడు పోనీ వ్యక్తిత్వానికి
నా ఓటు పేదల కన్నీటిని తుడిచే చేతికి
కష్ట కాలంలో వెన్నంటి నిలిచిన ధైర్యానికి
నా ఓటు నా తరువాత తరాలకి
తలవంచని ఆత్మగౌరవానికి
నా ఓటు నియంతలకు గొడ్డలి పెట్టు
నా ఓటే నా స్వరం వినిపిస్తాను సమరశంఖమై రాజకీయ కురుక్షేత్ర సంగ్రామంలో...
Comments
Post a Comment