నీవైతే చాలు



నీ పేరేదో ధ్వనించు శబ్దమే చాలు 
నీ పైనుంచి వ్యాపించు గాలైన చాలు 
నీ మృదుకరములు తాకించు స్పర్శైతే చాలు
నుదుటినే ఉదయించి సూర్య బింబము చాలు
కటిక చీకటికి మేటి నీ కంటి కాటుక చాలు
రవివర్మ కుంచెకు జాలువారిన బొమ్మ చూస్తేనే చాలు
రేయిలో హాయిగా తీయని కలవైతే చాలు 
కడవరకు విడువక తోడుండు కోరికే లేదు 
నేనెలా కోరేది ఆ గొప్ప వరము నీ జడపూజ పువ్వునైతే చాలు 
నీ చిరునవ్వు చిందించు అధరాలు చిలికించు మధుర సుధలను చూడు చెక్కిళ్లపై చుక్కనైతే చాలు
కనులకే కనిపించు కవ్వించు కవితలే రాయించు శక్తివే నువ్వు...

Comments

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi