నెలరాజు/ monthly king
చక్కనైన నెలరాజు తోడుగా వెన్నెలమ్మ చీకటి
వన్నెల విప్పి ప్రకృతమ్మ వాకిట కౌగిలి బిగువలో
బంది అయి ఎర్రని సిగ్గుల బుగ్గన తారల మెరుపిస్తే
మల్లెమొగ్గ విచ్చుకున్నది ఆ చల్లని నీలి రేయిలో
విచ్చుకున్న మల్లెలన్ని మధువు చిలకగా
చలిగాలులు చెలిగలులై గిలిగింతలు పెట్టగా
యదను తాకినా మధుర జ్ఞాపకంలో తనువు
జ్వలించేను మథనుని మనోనేత్రమై
మదిన జనించు ప్రతి జ్వాల జయించినియదు
ప్రణయరసాన్ని ఆ రస సాగరాన కలిసిన
మధురమైన రసఝరీలో జగతి మిళితమైపోయి
రసబంధాన్ని ఏనాడో పెనవేసుకుంది
Comments
Post a Comment