నీ స్నేహం /urs friesndship
చలి గాలులు అనుకుంటున్న వేళ
అలసిన సూర్యుని నిద్రకు ముస్తాబవుతున్న వేళ
చల్లని సాయంత్రపు అందాలను చూసి చూడనట్లు
చూసే నీ నీలి కళ్ళలో దాగిన తారల వెలుగులు
మరుగున పడిన ముచ్చట్లు జ్ఞాపకాలు తిరిగి
వచ్చిన ఆ క్షణాలు మరువ తరమా...!
నిన్ను చూసిన ఆ క్షణం నా మది కాయను గాయం
మాట రాని క్షణం తెలుపలేని భావం
చూడగలిగే మనసుంటే అవధులు లేని
ఆకాశపు లోతులను తాకే మధుర అనుభవాలు
మరు జన్మకు దాచుకునే అంతులేని జ్ఞాపకాలు...!
ఆ రోజు మొదలు ప్రతి రోజు నీరాకకై
నిరంతర అన్వేషిణైతి నిన్ను చూసే ఈ క్షణం వరకు
మాటలకు అందని ఎన్నో భావాలను నీ కళ్ళలో దాచావు
నా మనసులో భావాలను సైతం అందుకోగలిగే నీవు నా స్నేహ హస్తాన్ని అందుకుంటావాని ఆశిస్తూ నేను...!
Comments
Post a Comment