ప్రేయసి / preyasi
ప్రేయసి
నా నీడ నీ బుగ్గ ముద్దాడుతుంటే
అది చూసి మేనంత పులకించపోదా
నీ కొంటే చూపే నా వీపునంత తడిమేస్తూ ఉంటే
మళ్ళించగలన నా మనసునైనా నీ ధ్యాసనుండి
నేరుగా ఎదురైతే చూడగలనా నిన్ను
తారవై సాక్షాత్కరిస్తావు నా కన్నులముందు
నీ అడుగుల సడి వినగానే మునుముందుకే తిరగదా కాలమే చక్రమై నేనెంత వాడిని
తపించిపోనా నిన్ను చూడక ఒక్కరోజైనా
నిను వీడి నేనుండగలనా ఏ జన్మకైనా
నీ జతను కోరి నీ చుట్టూ తిరిగే నన్ను
చూసి నీ నీడ అడిగే నీవెవరు అంటూ
జాలైనా లేదు కనులైన కలపవు ఉలకవు
పలకవు నేనంటే నీకంత బెట్టెందుకు
మనసంతా నీ నామస్మరణే వరమిచ్చి కరుణించి తరలిరా తరించిపోతాయి నా తరాలు నీ రాకతో ...
-- అప్పలరెడ్డి
Comments
Post a Comment