నీ వాడిని నేను


ఏది నాకోసం ఓ కన్నీటి చుక్కను రాల్చు మరుపురాని ముత్యమై మీ మెడను చేరుతాను

మౌనమై నీ మదిన భాషించు మదీయరాగమై ప్రతిధ్వనిస్తాను

కనులు మూసి స్వప్నించు తీయ్యని కలనై నీ కనులు చేరుతాను

నను తలచి చిరునవ్వు చిందించు చిటికలో ఊహనై నీ ముందు ఉంటాను

వేవేల తారలే నా కన్నులముందు తిరుగుతూ ఉన్న  సరితుగునా నా చెలి నవ్వుకి సరిపోల్చుతుంటాను

కటిక చీకటంటి కష్టమే ఎదురైనా నీ గుండెలో దీపమై ధైర్యంగా ఉంటాను

మనిషి అయితే ఉన్నాను మనసంతా నీ ధ్యాసే 
దూరాన ఉన్న నీ వాడిని నేను నీ నీడై నీ తోడు ఉంటాను 
 

Comments

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi