దేవుడు

తడబడ్డ అడుగును నాన్న దిద్దితే
పొరబడ్డ నుదిటి గీతను గురువు దిద్దుతాడు 
తిరగబడే కాలానికి ఎదురొడ్డి నిలబడే ధైర్యాన్ని నింపుతాడు 
బెత్తంతో కొట్టిన గట్టిగా వెన్నుతట్టి 
మన బంగారు భవితకు మెరుగులు పెడతాడు

దైవాన్ని అయినా గుర్తించే శక్తిని గురువైన ఆ దేవుడే ఇస్తాడు
తిరిగే కాలానికి విలువ కట్టి నిలువెల్లా నింపుతాడు 
తిరగబోయే కాలంలో జరగబోయే నిజాలు చెప్పి హెచ్చరిస్తాడు 
కాలం నీకు నేర్పబోయే గుణపాఠాలను
ముందుగానే పాఠాలుగా చెప్పి జాగ్రత్త చెప్తాడు 

అడగకుండానే జన్మనిచ్చిన  తల్లిదండ్రులకు చివరి దశలో తోడుండి రుణం తీర్చుకుంటాం
నీవు తప్ప ఎవరూ లేరని దండం పెట్టి దైవానికైనా పుష్పమో ఫలమో ఇచ్చి వరం కోరుతాం 
ప్రతిఫలమే ఆశించకుండా మన నమస్కారానికే పొంగి వరమిచ్చే దేవుడే గురువు
తల్లిదండ్రులకు సమానంగానో ఒక మెట్టు పైనో గురువు ఉన్నాడు 

Comments

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi