కవిత్వం

కవిత్వం అంతరంగల మథనం

తీరని కోర్కెల దాహం 

ఎడారి ఒంటరి ప్రయాణం 

చావేలేని మరో ప్రపంచానికి మార్గం 

మహి విడిచి మహిమలు చూడగల మూడో నేత్రం

రాలిపడే ఉల్కా పాతాళ సమూహం 

ఎగసిపడే అలల సమాహారం 

ఇతిహాస కల్పనల ఊహాగానం 

పసిపిల్లల నవ్వులు కన్నెల అందాల కాల్పనికం

మండే సూర్యుడు మరిగే రక్తపు చైతన్యం

అణచివేతలు బానిసత్వపు తిరుగుబాటు విప్లవం

మనసున్న మనుషుల తనలో తాను మాట్లాడుకునే స్వగతం

Comments

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi