ఇద్దరం ఒక్కటే తమ్ముడు
ఇద్దరం ఒక్కటే తమ్ముడు
అంటరాని వాడివంటు నిన్ను
రిజర్వేషన్ లేదంటు నన్ను
ఆఫీస్ నుండి బయటికి నన్ను
ఊరు నుండి బయటికి నిన్ను
గంజి పోయలేని స్థితిలో నేను
గంజైన తాగనీయని స్థితిలో నిన్ను
స్వాతంత్రం ముందు నువ్వు
స్వరాజ్యపు ఉక్కు కౌగిల్లో నేను
ఏది చేస్తే తప్పు అంటారో అని నువ్వు
ఏమీ చెయ్యలేని తప్పుల ఊబిలో నేను
భయంలో నువ్వు బాధలో నేను
ఇద్దరం ఒకటే తమ్ముడు
నా పైన అస్త్రానివి నువ్వు
నీ పైన అణుబాంబును నేను
రాజకీయ చదరంగంలో
పావులం తమ్ముడు మనం
స్వేచ్ఛ కాంతులు సోకిన ఏడు దశాబ్దాల కాలంలో నేను ఎన్నో కోల్పోయాను
ఇకనైనా నన్ను నీలో కలుపుకో తమ్ముడు
Comments
Post a Comment