పండుగ
పండగ పండగ మా ఊరు పండగ
ఏడాది కోపాలి వచ్చెడి మా తల్లి పండుగ
తప్పెట్ట్లు తాళాలు సాముగరిడిలు
హరికథలు బుర్రకథలు వాలకాలాడెరు
మందుగుండు సామాగ్రి
మందుబాబుల తీరు మెండుగా పెలేను
నింగిలో చుక్కలై మా సీమపడుచులే మెరిసేను
చుట్టు పక్కల ఎటు చూడు చుట్టాల సందడ్లు
చిన్న పెద్దల కేరింతల కళకళలు
కణ కణ మండేటి సూరీడు ఒకకన్ను
మిలమిల మెరిసేటి చందురుడు ఒకకన్ను
సకల సత్తువకు మూలమైన తల్లి శక్తినంతా నిలువెళ్ళ నింపి కొలువైన రోజు
మా తల్లి మమ్ములిన్ని సల్లంగా చూడంటు సాగిల పడి మొక్కేటి జనుల తోడ నిండి కన్నుల పండగ
పండగ మా ఊరి పండగ
Comments
Post a Comment