నాయకుడు / Leader
అవినీతి పరులకు కదిలే సింహం అతను
రాజకీయ రణ రంగంలో గర్జించి దూకెను
ఉద్యమ శక్తి నిలువునా నింపుకున్న విప్లవశంఖం
పోరాటాలకు యుద్ధాలకు వెనుకాడని నైజం
పేదల కన్నీటికి అసహాయుల సహనానికి మూర్ఖుల పట్టుదలకు సెలవంటూ ఉదయించిన కిరణం
చెదలు పట్టిన చరిత్రకు జీవశక్తిని మురికి పట్టిన రాజకీయానికి కొత్త శుద్దిని మరిగే యువ రక్తంతో కొత్త చైతన్యాన్ని నింపే పోరాటశక్తి
నిప్పులతో కడిగిన మారని సమాజానికి మార్పుకై అడుగేసిన కొత్త తరం నాయకుడు అతను
బాకులు కత్తులు కొడవళ్ళకు భయపడని గుండె ధైర్యం నడిచే నిప్పు కణం అతను
మల్లెలాంటి మనసున్నొడు మచ్చుకైనా మచ్చలేని చంద్రుడు మా కోసమే వచ్చిన మా దేవుడు
Comments
Post a Comment