విలయం / vilayam

విలయం


ఈ విలయం ప్రళయాన్ని తలపిస్తుంది
ఇదే అంతమేమో అనిపిస్తుంది
నీ ప్రయాణం ప్రపంచాన్ని ఒకతాటిపైకి తేవడానికా 
ఒకే దెబ్బకు తీసుకుపోవడానికా  

బాధ్యత భయం లేని సమాజానికి  
మృత్యుఘంటికలు మ్రోగించావు 
సరిహద్దుల గీతలు తుడిచి 
తలరాతలు మార్చి పంతాలను నేలమట్టం చేశావు

తారతమ్య భేదాలకు నిప్పంటించి 
అంతా ఒక్కటే అనిపించావు 
ఇప్పుడు సామ్రాజ్యవాదంతో అగ్రరాజ్యం 
అనిపించుకునే యుద్దాలు లేవు

సాటి మనిషి బాధను చూసి అయ్యో అనలేని
అందరి చేత కన్నీటి ధారలు పెట్టించావు
అన్నార్తుల ఆర్తనాదాలు విని ఆదుకోవడానికి 
చేయి అందించలేని చేతకానివాడిని చేసావు

నువ్వు కాలు మోపిన చోట 
ఎడారులను తలపించిన మహానగరాలు
నిర్మానుష్యమైన రహదారులు నీ రాకను 
తెలుపుతూ మరణం తధ్యం అన్నాయి

అడవిని చుట్టూ ముట్టిన కారుచిచ్చుల
కనివిని ఎరుగని రీతిలో కాటేస్తున్నావు
మనసుని కట్టడి చేయలేని మనుషులు 
సామాజిక బాధ్యతను వీడి నీ వైపే అడుగులు

ప్రపంచానికి ఇన్ని ఇచ్చిన నువ్వు మాకు 
ఎందుకు ఇవ్వవు జవాబుదారీతనం 
ప్రాణ స్నేహితుడైనా శత్రువు అవుతున్న ఈ క్షణాన 
మానవ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం 
                                                                     -- అప్పలరెడ్డి

Comments

  1. ఒక్కోసారి విలయం కూడా పరిణితి నీ తీసుకువస్తుంది. చూడాలి ఈ మహమ్మారి నేర్పిన పాఠాలు ఏ మార్పుకో 🤔:-)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi