అమ్మ భాష / mother tounge
అమ్మభాష - తెలుగు
మాతృభాషను నేను
నీలో కలిగే భావాలకు
రూపాన్ని నేను
ఒక్క పదంతో మీ
అందరిలో చైతన్యాన్ని
కలిగించగల విప్లవశక్తిని నేను
అభ్యుదయ పదాలతో నిప్పుల
వర్షం కురిసే అలజడిని నేను
ప్రేమగా లాలించే అమ్మ పాటను నేను
నువ్వు అమ్మ నుండి బయటికి రాగానే
పరిచయమైన మొదటి మాటను నేను
ఎన్ని భాషలు నేర్చిన బాధ కలగగానే
పలికే మొదటి పదాన్ని నేను
మనసారా బయటికి వ్యక్త పరచగల
మనో రథాన్ని నేను
నేను లేని నీవు లేనే లేవు
మరి ఎలా మరువగలవు నన్ను
పండుగనాడు గుర్తు చేసుకొని
మొక్కి తప్పించుకుందాం అనుకుంటున్నావా
నా వారసత్వాన్ని కూని చేసే హంతకుడివి కాబోకు
అమ్మ అని పిలవలేని మూగతనం నీకెందుకు
- అప్పలరెడ్డి

Good feel nice
ReplyDelete