జాబిల్లి / jabilli

జాబిల్లి



ఏ తీగ పువ్వో
సిరి గజ్జ మువ్వో
వికసించిన పువ్వో
ఆ చిరు నవ్వు

మదిని మురుపించావో
కనులతో కవ్వించావో 
నీ ఊహలు నాపై రువ్వినవో
నన్ను కదిలించి కరిగిపోయావు 

నిన్ను కోరే నేను ఒంటరినో
నీ జతకై నిన్ను వెతికే నీ తోడునో
అందని జాబిలివై నింగిన దాగావో 
మసకబారిన కంటి ముందు ముసుగువైనావు

చీకటి అంచున చిరు దివ్వెవో
నా ఆశల రథానికి సారథివో
నువ్వు ఎప్పుడు ఉదయిస్తావో
నీ రాకకై చూస్తున్న నేను....!
                                                              --అప్పలరెడ్డి.

Comments

  1. అమ్మ భాషలో సాగిస్తున్న సాహిత్య స వారీ
    ఎఱ్ఱగులాబీలు మల్లెమాలాలంకృతయై
    జాబిల్లివంటి ఊహాప్రేయసి వైపు పయనించి
    నీ మనోరథము ఫలింపజేసి నిన్ను
    గమ్యమును చేర్చుటలో సఫలమగుగాక!

    ReplyDelete
    Replies
    1. ఏ.వి ఆర్.కృష్ణమూర్తి

      Delete
  2. ఆంధ్ర సాహిత్య సుమమువై దశదిశలను
    భావపరిమళభరితము చేయుదువుగాక.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ

ఎర్ర గులాబీ / erra gulabi