ఎర్ర గులాబీ / erra gulabi


ఎర్ర గులాబీ






నేనొక విప్లవశంఖాన్నీ
ఒక్కసారైనా స్పృశించి చూడు
నాలో రగిలే అగ్నిజ్వాలశిఖలు
నాలోని భావం స్పురింపజేస్తాయి.

ఒకసారైనా పూరించి చూడు
నా గుండెలో దాగిన పేదల 
కన్నీటి స్వరాలు వినిపిస్తాయి.

నేనొక విప్లవ గీతాని నన్ను 
స్మరించి చూడు నా వాణి
నీ గళంలో ప్రతిధ్వనిస్తుంది.

నేను అభ్యుదయ తీగలు 
అమర్చబడిన వీణని ఒక్కసారి 
మీటి చూడు ఎందరో అమరవీరుల
స్వరాలు తంత్రులపై విహరిస్తాయి.

భగ భగ మని కణ కణ మని
సెగలు కక్కుతున్న చరిత్రను నేను
ఒక్క అక్షరానైన పఠించి చూడు
ఉప్పెనై ధనికుల ఆసాముల
రాజుల రాజ్యాలను సైతం 
ముంచేసిన దుఃఖ సంద్రం
నీ కనులకు కనిపిస్తుంది.

నేడు నువ్వు గుండె నిండా పీల్చుకున
స్వేచ్ఛ వాయువుని నీకు తెలియకున్నా 
నీ గత చరితను నీతోనే జీవిస్తున్నాను.

నిర్భయంగా ప్రాణాలతో 
ఉన్న ప్రేతాల మధ్య తిరుగుతున్న 
నీ ధైర్యాన్ని నేను నీకు ఆరో ప్రాణాన్ని
ఈ యుగాదిన వికసించిన ఎర్ర గులాబిని .

అందరూ కోరుకునే ప్రపంచ శాంతికి మరో రూపాన్ని
పెళ పెళ మని విరుచుకుపడు
ఉరుముల మెరుపులను నాలో నింపుకొని
నీలోని చైతన్యం ఆశిస్తూ నేను జ్వాలిస్తునే ఉంటాను.

                                                        - అప్పలరెడ్డి

Comments

Post a Comment

Popular posts from this blog

సింధూరం

నిరీక్షణ