సాయం సంధ్య / A true love story
ఏంటి ప్రకాశం గారు ఎప్పుడు పార్క్ లోకి వచ్చి అలా కూర్చొని వచ్చేపోయే జంటలను చూస్తూ ఉంటారు ఎందుకని . సూర్యుడు నిదానంగా తగ్గుముఖం పడుతున్నాడు అడిగిన ప్రశ్న కొత్తదేం కాదు గాని ఈసారి మాత్రం కొత్తగా అనిపించింది నీకెందుకు అలా అనిపించింది రఘు . ఏం లేదు చాలా రోజుల నుంచి చూస్తున్నాను కదా ఏదైనా కారణం ఉందేమో అని . ఏం నేను చూడకూడదా . అలా అని కాదు మీరు ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు కదా ఎందుకా అని .
సూర్యుడు ఆకాశాన్ని ఎర్రని కాంతులతో నింపి లోకానికి చీకటిని పులుముతు నిద్రకు ముస్తాబవుతున్నాడు రఘు నేను ఇలా ఉండడానికి కారణం అయితే ఉంది కారణం ఒకటే అయిన అదే అనేక కారణాలుగా మారి నన్ను ఇలా చేసింది. చెప్పండి సార్ చెప్తే మేము తెలుసుకుంటాం కదా. మనిషి కోరికల రధానికి ఆశలు స్వార్థం అనే గుర్రాలను కట్టి పరుగులు తీస్తుంటారు అలాంటి పరుగులో ఓడిపోయాను . జీవిత పాఠాల ఉన్నాయి చెప్పండి సార్ మాకు అనుభవం వస్తుంది కదా మేము నేర్చుకుంటాం .
ఎంత తెలుసుకుంటూ నేర్చుకుంటున్న ఎంతోకొంత అనుభవంలోకి వస్తే కానీ తెలియదు. నిజమే అయిన తెలుసుకోవడం అనేది ఒకటి ఉంది కదండి . రఘు తో మాట్లాడుతూనే జీవితంలోని పేజీలన్నీ ఒక్కొక్కటిగా గిర్రుమంటు వెనుకి తిరుగుతున్నాయి . ఆ రోజే ఊర్లో దిగాను బస్ స్టాప్ లో దిగి ఎవరిని అడిగినా చెప్తారు అని చెప్పారు కాని ఇక్కడ ఎవరు లేరు మా వాళ్ల రూమ్ కి దారి తెలియక చుట్టూ చూస్తున్నాను అడ్రస్ తెలియదు అనే విషయం మొఖం మీద రాసినట్లు ఎక్కడికి వెళ్లలండి ఎవరి ఇంటికి వచ్చారు అని పది సంవత్సరాల కుర్రోడు అడిగాడు సుందరమ్మ గారి ఇంటికి అనగానే చకచక దారి చూపించి అదేనండీ ఇల్లు అంటూ రయ్యిమని పరుగులు తీసుకుని వెళ్ళిపోయాడు .
రూంలోకి అడుగు పెట్టగానే బ్రహ్మచారుల వాసన గట్టిగానే తగిలింది ఆ మాత్రం లేకుంటే కుర్రోళ్ళు ఎలా అవుతారనిపించింది. ఎలా అయినా నేను ఇక్కడే ఉండి చదువు పూర్తి చేసుకొని ఏదైనా ఉద్యోగం సంపాదించి ఇక్కడి నుండి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నాను. అనుకున్నట్టే చదువు బాగా సాగుతుంది నేనెప్పుడూ అంతగా గమనించలేదు పక్కింట్లో ఎవరో అందమైన అమ్మాయి కూనిరాగాలు తీస్తూ చకచక అటు ఇటు తిరుగుతూ గజ్జలు గళ్ళు గళ్ళు అనిపిస్తుంది.
ఎందుకు ఆ దృశ్యం కాసేపు నన్ను కట్టిపడేసింది అలా చూస్తూ ఉండిపోయాను తరువాత మా వాళ్ళని అడిగితే ఇంటి పక్కన సుందరమ్మ గారి చెల్లెలని చెప్పారు చక్కని అందం మృదువైన స్వరం ఆకర్షణీయమైన మాటతీరు సులువుగా కలిసిపోయే తత్వం అందానికి ఆకర్షణకే కాక మంచి మనస్తత్వం కూడా ఉందనిపించింది . ఆ రోజు రూంలో ఎవరూ లేరు ఒక్కడినే కూర్చొని చదువుకుంటున్నాను.
ఎవరో తలుపు కొడుతున్నచప్పుడు తలుపు తీశాను పక్కింటి అమ్మాయి వచ్చింది . ఏవండీ ఎలా వచ్చారు . చిన్న పని ఉండి వచ్చాను రూమ్ లో ఎవరు లేరా . ఎవరు లేరు బయటికి వెళ్లారు నాతో చెప్పండి పర్వాలేదు నేను చెప్తాను . మార్కెట్ కి వెళ్లి సరుకులు తీసుకురావాలి సరుకులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అక్క అంది పైనున్న కుర్రవాళ్ళ లో ఎవరినైనా తోడు తీసుకుని వెళ్ళమంది ఎవరైనా వస్తారేమో అని అడుగుదామని వచ్చాను . దానికి ఏముందండి నేను వస్తాను .
మీరు పరిచయం లేరు కదా అడిగితే ఏమనుకుంటారో అని అడగలేదు . పరిచయానికి ఏముందండీ నా పేరు ప్రకాశం మరి మీ అందమైన పేరు చెప్పండి . భలే సరదాగా మాట్లాడుతున్నారే అంత అర్థమైంది ఏం కాకపోయినా నా పేరు పద్మ . పేరులో మంచిచెడులు అందం అందవిహీనం ఏమ్ ఉండవండి ఏదో మాటవరసకి అలా అడుగుతాం అంతే అని ముందుకి సాగాం మార్కెట్ కి వెళ్ళాం.
సరుకులను తీసుకొచ్చేసరికి ఒంట్లో ఉన్న ఓపిక అయిపోయింది రూంకి వచ్చి పడుకున్నాను. కాసేపటికి మళ్లీ తలుపు చప్పుడు వినిపించింది పద్మ వచ్చింది ఏదో క్యారేజ్ చేతిలో ఉంది ఏంటండీ ఏం తీసుకువచ్చారు . భోజనం తీసుకువచ్చాను తీసుకోండి . మీకు ఎందుకండీ ఇబ్బంది . ఇందులో ఇబ్బంది ఏం ఉందండి అలా అయితే ఇంతకముందు మీరు చేసిన సాయాన్ని కూడా అలానే అనుకోవాలా. అలా కాదండీ . ఏం పరవాలేదు ఈ సారికి తీసుకోండి.
ఎప్పుడైనా మీరు పిలిస్తే మేము వస్తాం అంటూ వెళ్లిపోయింది అలా రోజులు గడుస్తున్నాయి. పరిచయం బాగా పెరిగింది స్నేహం కుదిరింది నెలలు గడుస్తున్నాయి. ఏదో తెలియని కొత్త ఆకర్షణ మొదలైంది రోజు కాలేజీ, చదువు, స్నేహితుల విషయాలు నా పరిస్థితి వాళ్ళ ఇంటి విషయాలు మాట్లాడుకుంటూ మరి దగ్గరైపోయాం. ప్రతి రోజు మా ఇద్దరి మధ్య జరుగుతున్నవి అన్ని మధుర జ్ఞాపకాల మనసులో పదిలమై పోతున్నాయి .
డాబా మీద ఉదయించే సూర్యుడిని చూస్తూ ఉండిపోయాను.
ఉదయించే సూర్యుడు ఎంత ఎర్రగా ఉన్న చల్లగానే ఉంటాడు. మధ్యాహ్నం మెరుగు పెట్టిన బంగారంల ఉంటాడు భగభగ మని కల్చేస్తాడు. ఎంటో వింత ఏవండోయి ప్రకాశంగారు అంటు తియ్యని గొంతు వినిపించింది. కాఫీ తీసుకోండి సర్ అంటు పద్మ వచ్చింది . ఏకాంతంలో ఏం చేస్తున్నారు సర్ ఏ కాంత కోసమైన కాంక్షిస్తున్నారా . ఇంకా ఆ స్థాయిలోకి వెళ్ళలేదు లేండి. ఏదో ప్రకృతిని ఆస్వాదిద్దాం అని ఇలా నిలబడ్డాను.
మీకెందుకు ఈ శ్రమ చెప్పండి . పక్క పక్కనే ఉండే వాళ్ళం కదా అని కొంచం కాఫీ ఇస్తే కష్టం శ్రమ అంటూ ఇలా అంటారా ఏదో కష్టపడింది పాపం అని ఏ కాంప్లిమెంటో ఇవ్వాలి కాని అయిన నా కాఫీ నాకిచ్చేయండి . అలా ఇస్తే ఎంగిలి అవుతుంది లేండి . వీటికేం తక్కువ లేదు అని చిరుకోపం చిరునవ్వును పెనవేసింది.
కప్పు ఇస్తే వెళ్తాను మురిపంగా అంది . చాలా రుణపడుతున్నాను ఎందుకు ఇంత ప్రత్యేకం నేను అని అడిగాను. అది మీకు తెలుసునులెండి అంటు చెప్పకనే చెప్పింది. నువ్వంటే ఇష్టం అని అయిన గీతదాటి నువ్వంటే ఇష్టం అని చెప్పలేని స్థాయి నాది మౌనంగానే కప్పు చేతికి ఇచ్చాను అలా ఉన్న నన్ను చూస్తూ మెట్లు దిగుతువెళ్ళిపోయింది. ధైర్యం చాలలేదనో స్థాయి సరిపోదనో మాట పెగల్లేదు .
ఎక్కడికి వెళ్తున్నావ్ పద్మ . ప్రకాశం గారు వాళ్ల స్నేహితులు బయటికి వెళ్దాం రమ్మంటే అలా వెళ్తున్న అక్క . ఏంటో ఈ పిల్ల మగ పిల్లలతో స్నేహం అర్థం కావట్లేదు సాయంత్రం త్వరగా వచ్చేసేయ్ బావగారు వస్తే కోప్పడతారు. అలాగే అక్క టైం అవుతుంది త్వరగా వచ్చేస్తాను . ఏంటి ప్రకాశం గారు అలా ఉన్నారు . ఎక్కడికో ప్రయాణమైనట్టున్నారు మేడం గారు. మీతో అలా బయటకువెళ్దాం అని బయల్దేరాను ఇలా కూర్చున్నారు ఏమైంది.
ఏం చెప్పమంటారు అండి మా కష్టాలు ఎగ్జామ్ ఫీజు కడదామంటే డబ్బుల్లేవు మా వాళ్ళను అడుగుదామంటే వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది . ఏం నన్ను అడగకూడదా . మిమ్మల్ని ఎలా అడుగుతామ్. నేను ఇవ్వకూడదా మరి పరాయి దాని చేస్తున్నారు .అలా అని కాదు . ఎలా అని కాదు ముందు డబ్బులు తీసుకోండి మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి అంటూ ఐదువందలరూపాయలు ఇచ్చింది.
ఎందుకు నాపై ఇంత అభిమానం ఎంటో ఈ బంధం ఎంత దూరమో తెలియదు గలగలమని వెళ్లిపోయింది. స్వార్థంతో ప్రవర్తిస్తున్నాను అనిపిస్తుంది. తను చేస్తున్న సాయాన్ని తిరిగివలేను నాకు వద్దు అంటే తన మనసు నోచ్చు కుంటుందేమోనని ఇంకో పక్క అనిపిస్తుంది .
ఏం తిరిగి వచ్చేశావ్ . ఎక్కడికి వెళ్ళడం లేదంట అక్క . రేపు నువ్వు మన ఊరు వెళ్ళాలి పద్మ. ఎందుకు అక్క . మన సుశీలకు పెళ్లి సంబంధం కుదిరింది. పెద్దమ్మ నిన్ను నెల ముందుగా పంపమని కబురు పంపింది. చెప్పేది వినకుండా వెళ్ళిపోయావ్ బట్టలు సర్దుకో ఉదయమే ప్రయాణం.
ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాట వరసకైనా చెప్పేది. ఈ సారి ఒక్కమాట చెప్పలేదు. ఇన్నీ రోజులైనా పద్మ గురించి ఒక్కమాట కూడా లేదు సుందరమ్మ గారిని అడుగుదామనుకున్నాను. ఏమనుకుంటారో అని ఆ సాహసం చెయ్యలేక పోయాను. రోజు తన గురించే ఆలోచనలు దేని మీద ఏకాగ్రత ఉండటం లేదు రోజులు లెక్క పెట్టుకుంటున్నాను.
ఉదయించే సూర్యుని ఎన్ని సార్లు అడిగి ఉంటానో తను ఎప్పుడు వస్తుంది అని . ప్రకాశంగారు ఇంటిలో ఒక్కరే ఉన్నారు మీ స్నేహితులు ఎక్కడి వెళ్ళరు . పద్మగారా ఎప్పుడు మీ రాక మీ గురించే ఆలోచిస్తున్నాను. మా వాళ్ళు ఏదో పని మీద బయటకి వెళ్ళరు వచ్చేస్తారు కుర్చోండి . నా గురించి మీరు ఆలోచిస్తున్నారా ఏంటి సార్ ఏంటి సంగతి మిమ్మల్ని చూడాలని ఎప్పుడు మాకు అనిపిస్తుంది ఈసారి ఏంటి మీకు అనిపించింది కొంచెం వింతగానే ఉంది . మీ నుండి మీ ఆలోచనల నుండి దూరంగా వెళ్లిపోదాం అన్నా వీలు కావడం లేదు.
ఏం చేయాలో తెలియడంలేదు నాతో మీరు సుఖపడతారు లేదో కూడా తెలియటం లేదు ఆస్తి లేదు ఉద్యోగం లేదు వెనక ముందు లేనివాడిని నాలాంటి వాడితో స్నేహం మీకు మంచిది కాదు మీ అక్కగారికి తెలిస్తే బాగోదు . ఉరుకొండి అంతస్తులు ఆస్తులు మన ప్రేమకి అడ్డురావు . అన్నా ఆ మాటతో ఒక్కసారిగా ఆస్తుల అంతస్తుల నుండి కిందకు దిగి వచ్చినట్టు అని పించింది ఉద్యోగం అంటారా నేను చేస్తాను ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదా .
ఆ మాటలకు అలా చూస్తూ ఉండిపోయాను . అలా చూడకండి మీకేం మేము తక్కువ కాదులేండి . అలాగని కాదు . మరి నేను ఉద్యోగం చేయలేనా అంటు చిలిపిగా కళ్ళు మెరిపించింది ఇంకా ఇది చాలు అనిపించి కష్టాలను కలిసే పంచుకుంటాను. అంటూ కళ్ళతోనే చెప్పింది మాటల యుద్దాని జయించింది. మౌనం మాటలై ప్రతిధ్వనిస్తూన్నాయి. ఆ మనసులలో ఒక్కొక్క అడుగు దగ్గరకు చేర్చాయి. బిగికౌగిలితో బంధంపడింది ఆ ఏకాంతంలో రెండు మనసులు ఒక్కటైపోయాయి.
ఈ లోకాన్ని విడిచి విహరిస్తున్నారు. పద్మా అన్న పిలుపుతో ప్రేమ తపస్సు భగ్నమైంది. ఆ వస్తూన్న అక్క అని వెళ్ళింది . ఏం చేస్తూన్నావ్ అక్కడ . ఏం లేదు అక్క ఊరికే ఏమి తోచకపోతే ప్రకాశంగారితో మాట్లడుతున్నాను . అబ్బాయిలతో అలా ఒంటరిగా మాట్లాడం మంచిది కాదు. అబ్బాయి మంచివాడే అయిన అలా చనువుగా ఉండటం నీకు మంచిది కాదు . ఎప్పుడు ఏదో ఒకటి అంటునే ఉంటావ్ ఊరి వెళ్ళి వచ్చాను కదా ఎలా ఉన్నారని పలకరించటనికి వెళ్తే . అలా కాదు పద్మ మన అమ్మనాన్న లేరు నీ బాధ్యతాంత మా పైన ఉంది.
బావగారు చెప్పినట్లు నడుచుకోవాలి అర్థమైందా. ఇప్పుడు బావగారి మర్యాదకి వచ్చిన తక్కువ ఏం లేదు . నీ మంచికేనమ్మ నువ్వు సుఖంగా ఉండాలనే కదా చెప్పేది. నేను గమనిస్తున్నాను ఆ అబ్బాయిని నిన్ను నువ్వు అతని ఇష్టపడుతున్నవా . అవును ఇష్టడుతున్నాను అని చెప్పాలి, అనుకున్నాను అక్క ముందు నిలబడి చెప్పడానికి ధైర్యం సరిపోలేదు.
మౌనంగా ఉండిపోయను మౌనం అంగీకారం అనుకుందో ఏమో అతను ఉద్యోగ పరిస్థితి ఏంటి ఆస్తి ఎంతుంది. మనవాళ్ళేన అంటు ఎన్నో ప్రశ్నలు ఏం చెప్పాలో అర్థకావటం లేదు. దేనికి సమాధానం లేదు నేను ఎప్పుడు అవి పట్టించుకోలేదు. పెళ్ళికి ఇవ్వని కావాలా అనిపించింది. ప్రకాశంగారు ఎప్పుడు చెప్పే మాటలు గుర్తుకు వచ్చాయి. ఇంతలో బావగారు వచ్చారు . ఏంటి అక్కాచెల్లళ్ళు ఏదో చర్చిస్తున్నట్టు ఉన్నారు .
పద్మ పక్కింటి ప్రకాశాన్ని ఇష్టపడుతుందట . మతిగాని పోయిందా ఏంటి ఆ కుర్రాడికి ఉద్యోగమా సద్యోగమా తెలిసి తెలిసి ఎలా పిల్లని ఇస్తాం. పద్మ నీకు ఇదే చెప్పడం అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. అబ్బాయిని పిలుస్తాను ప్రకాశం బాబు ప్రకాశం ఒక్కసారి ఇంటికి రా మాట్లాడాలి, అంటూ పద్మ బావగారు పిలిచారు . ఎప్పుడు కనీసం శంకరం గారు పలకరింపు కూడా ఉండదు, అలాంటిది ఇంటికి రమ్మంటున్నారు.
ఏంటా అని ఆలోచిస్తూనే ఇంట్లో అడుగు పెట్టాను పద్మ తల దించుకొని ఒక మూల నుంచుని ఉంది. సుందరమ్మ గారు శంకరం గారి వెనుక నించున్నారు . రా బాబు కూర్చో అమ్మాయి విషయం చెప్పింది పిల్లలు బాగోవాలనే కదా మేము అనుకునేది. నీకా ఉద్యోగం లేదు పిల్లని ఇస్తే సుఖంగా ఉంటుందని నమ్మకం లేదు. నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. లోకం తీరు పూర్తిగా తెలియదు. సంఘాల్లో జీవించడం చాలా కష్టం.
వాటిని ఎదుర్కోవాలంటే డబ్బు చాలా అవసరం, అర్థం చేసుకో . అర్థమైంది సార్ అమ్మాయిని విడిచి వెళ్లిపోవాలి అంటారు. డబ్బు ఒక్కటే అన్ని ఇస్తుందని మీ నమ్మకం. డబ్బు ఒక్కటే సుఖాన్నీ సంతోషాన్ని ఇవ్వదు. నా దగ్గర డబ్బు లేదు అని తెలిసి కూడా నాతోనే జీవితం పంచు కోవాలి అనుకున్న మీ మరదలకు తెలుసు సార్. డబ్బులో అవి లేవని అయిన ఎవరికో ఉద్యోగం ఆస్తి ఉన్నవారికే ఇస్తాం అంటారా. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, అంటూ నా అడుగుల ముందుకు సాగాయి.
ఆరోజు ఆయనకు ఆస్తి అంతస్తులు తప్ప ఇంకేమీ కనిపించలేదు ఒక్కసారి వెనకి తిరిగి చూసాను ఆ రోజు పద్మకి కళ్ళలో నీళ్ళు తప్ప నోటి నుంచి మాట కూడా రాలేదు. ఇప్పటికీ నాకు అదే గుర్తు రివ్వున కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి . కళ్ళు తుడుచుకోండి అయితే అలా సాగింది, అన్నమాట అయితే ఇప్పటికి మీరు కలుసుకోలేదా. రఘు కాలం బంధం తాలూకు జ్ఞాపకాలను భావాలను మోసుకు వస్తుంది, కానీ మనుషుల్ని తీసుకోరాదు . అంటే మళ్లీ కలవరా. ఆ సందర్భం రాలేదేమో ఇకపై వస్తుందన్న ఆశ కూడా లేదు . ఇంకా ఎంతకాలం సార్ ఒంటరిగా ఉంటారు.
చాలా పొద్దుపోయింది ఇంటికి వెళ్దాం పద రఘు. అది కాదు సార్ నేను చెప్పేది వినండి. ముందు ఇంటికి పద నడుస్తూ ఇంటికి చేరాం ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వీడికి చెప్పానో అర్థం కాలేదు. సార్ ఇంట్లో సామాన్లు అన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి, ఉండండి సర్దు తాను పుస్తకాలు కూడా పడిపోయాయి. మీరు అలా కూర్చోండి ఇదేదో లెటర్ లా ఉంది చూడండి .
పద్మ చివరిసారిగా రాసిన ఉత్తరం నాకు ఆరోగ్యం సరిగా లేదు మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఉన్నది, తరువాత మిమ్మల్ని చూస్తానని నమ్మకం లేదు ఒక్కసారి వస్తారని కోరుకుంటూ మీ పద్మ ఆ తర్వాత ఇంకా ఉత్తరాలు రాలేదు. ఈ లెటర్ ఏంటి సర్ ప్రకాశం గారు ఇది ఏంటి సార్ ఇది పలకరేంటి సార్ ఏం అయింది సార్ మిమ్మల్నే .... ఇన్నాళ్టికి జంట ప్రయాణం ఆ గగన వీధుల్లోకి ...
భగ్న ప్రేమకు బలవన్మరణాలు మార్గాలు కావు జీవితాంతం వారి జ్ఞాపకాలతో కాలం చేర్చే ఒడ్డుకు చేరిపోవడమే...
-- అప్పలరెడ్డి
Superrrr superrrr annayyaaaaa
ReplyDelete